
క్రీడలు

భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం 2026 ఈ నెల 30తో ముగియనుండగా, ఆయన స్థానంలో రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం జాతీయ భద్రతా మండలి సచివాలయంలో సైనిక సలహాదారుగా సేవలందిస్తున్న రాజా సుబ్రమణికి భారత సైన్యంలో దశాబ్దాల అనుభవం ఉంది. ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, అలాగే సెంట్రల్ కమాండ్‌లో కీలక పదవుల్లో ఆయన పని చేశారు. పరమ విశిష్ట సేవా పతకం సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయనకు లభించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!