
రివ్యూలు

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి ఏకంగా 272 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో అతని రీచ్ ఎంత భారీగా ఉందో స్పష్టమవుతోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాకిస్థాన్ మొత్తం జనాభా సుమారు 259.5 మిలియన్లు కాగా, కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య దానికంటే ఎక్కువగా ఉంది. క్రికెట్‌లో తన ఆటతీరు, విజయాలు, వ్యక్తిత్వంతో కోహ్లీ సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నాడనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!