
జనరల్

బెంగళూరులో కొత్త పార్కింగ్ పాలసీని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా నివాస ప్రాంతాల రోడ్లపై వాహనాలను పార్క్ చేసేందుకు వార్షిక పర్మిట్ విధానం తీసుకురావాలని ప్రతిపాదించారు. ఈ పర్మిట్ కోసం ఏడాదికి గరిష్ఠంగా రూ.25 వేల వరకు ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది.
ఇతర నగర రోడ్లపై గంటల ప్రాతిపదికన పార్కింగ్ ఛార్జీలు విధించనున్నారు. కేటగిరీ C రోడ్లపై కార్లకు గంటకు రూ.40, కేటగిరీ B రోడ్లపై రూ.60, కేటగిరీ A రోడ్లపై రూ.80 చొప్పున వసూలు చేసే ప్రతిపాదన ఉంది. ద్విచక్ర వాహనాలకు వరుసగా రూ.20, రూ.30, రూ.40గా ఛార్జీలు ఉండనున్నాయి. ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్‌కు నెలకు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ఫీజు ప్రతిపాదించగా, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య పార్కింగ్ చేసేవారికి నెలవారీ రేట్లపై 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!