

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో నిర్వహించిన తొలి వెట్రి తమిళనాడు ఇన్వెస్ట్‌మెంట్ కాన్‌క్లేవ్ 2026లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. మొత్తం 97 పెట్టుబడి ఒప్పందాలు కుదరగా.. వాటి విలువ రూ.67,452 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధనం, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెరగనున్నాయి.
విదేశీ కంపెనీల నుంచి కూడా తమిళనాడుకు భారీ పెట్టుబడులు రానున్నాయి. పలు విదేశీ ప్రాజెక్టుల ద్వారా రూ.15,050 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సెయింట్-గోబైన్, సూపర్ మైక్రో కంప్యూటర్ వంటి సంస్థలు కీలక పెట్టుబడులు ప్రకటించాయి. రాష్ట్ర పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేయడం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!