
రాజకీయాలు

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా 2026’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే కోటి మందికి పైగా ప్రజలు తమ ఫొటోలను ‘సెల్ఫీ విత్ తిరంగా’ కార్యక్రమం ద్వారా హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆగస్టు 9 నుంచి 17 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
ప్రజలు తమ ‘తిరంగా క్షణాల’ ఫొటోలు, సెల్ఫీలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఈ వేడుకల్లో భాగస్వాములు కావచ్చు. దేశభక్తి భావాన్ని చాటేలా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండటంతో కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!