

విడుదల తేదీ: ఆగస్టు 14, 2026
నటీనటులు: విశాల్, దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, జయప్రకాష్ తదితరులు
దర్శకుడు: విశాల్
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాత: ఆర్.బి. చౌదరి
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటింగ్: ఎన్.బి. శ్రీకాంత్
కథ:
కృప (విశాల్) జమున (దుషారా విజయన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. భార్య, ఇద్దరు పిల్లలతో సాధారణ జీవితాన్ని గడుపుతూ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుంటాడు. చాలీచాలని జీతంతో జీవనం సాగించే కృప.. తన మామగారికి చెప్పిన అబద్ధం కారణంగా బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేస్తాడు. అనంతరం కుటుంబంతో కలిసి ఆ కారులో ఊటీకి వెళ్లగా అక్కడ దాడి జరుగుతుంది. ఈ ఘటనలో అతని భార్య, కుమార్తె చనిపోతారు.
నెలకు రూ.25 వేల జీతం వచ్చే ఓ సాధారణ ఉద్యోగిపై ఎందుకు దాడి జరిగింది? అసలు ఆ దాడికి కారణం ఏమిటి? లింగా (విశాల్), అన్నపూర్ణ (అంజలి) ఎవరు? వారికి కృపకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్లు:
విశాల్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తన పాత్రలో విభిన్న వేరియేషన్స్ చూపిస్తూ ఆకట్టుకున్నారు. దుషారా విజయన్ తన పాత్రలో ఒదిగిపోయి, కీలక సన్నివేశాల్లో మంచి నటన కనబరిచారు. అంజలి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె పాత్రలోని డెప్త్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. తంబి రామయ్య, జయప్రకాష్‌తో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు.
మైనస్ పాయింట్లు:
సినిమా ట్రీట్‌మెంట్ కొంత రొటీన్‌గా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనాన్ని మరింత ఆసక్తికరంగా, కాస్త షార్ప్‌గా నడిపించి ఉంటే బాగుండేది. విశాల్, విలన్ల మధ్య కాన్‌ఫ్లిక్ట్ కూడా ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేదు.
సాంకేతిక విభాగం:
రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా చక్కగా చిత్రీకరించారు. కొన్ని చోట్ల ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. జి.వి. ప్రకాష్ కుమార్ పాటలు పర్వాలేదనిపించగా, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రచయితగా, దర్శకుడిగా విశాల్ కొన్ని చోట్ల మెప్పించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన మకుటంలో బలమైన ఎమోషన్, మంచి నటన ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. నెమ్మదిగా సాగే కథనం, సెకండాఫ్‌లో అక్కడక్కడా కనిపించే సాగతీత సినిమాపై ప్రభావం చూపాయి. అయితే విశాల్, దుషారా విజయన్, అంజలి నటన ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా మకుటం ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.
రేటింగ్: 2/5














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!