

SIR 2026 ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ ప్రక్రియలో అభ్యంతరాలకు సంబంధించి ఇప్పటికే నాలుగు సార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ.. 32,524 మంది ఓటర్లకు సంబంధించిన వ్యత్యాసాల జాబితాను ఇప్పటివరకు అందించలేదని ఆయన పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని 24 నుంచి 70 పోలింగ్ బూత్‌ల వరకు రీ వెరిఫికేషన్ నిర్వహించలేదని ఆరోపించారు.
ప్రసాదంపాడు ప్రాంతంలోని 58, 59, 53 పోలింగ్ స్టేషన్లలో “నో మ్యాపింగ్” కేసులు అధికంగా ఉన్నప్పటికీ ఎలాంటి వివరణ ఇవ్వలేదని వంశీ తెలిపారు. ఫోటో ఆధారాలతో ధృవీకరించిన బహుళ ఓటరు నమోదు కేసులు వెలుగులోకి వచ్చినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. SIR 2026 ప్రక్రియలోని అవకతవకలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆగస్టు 30న ప్రక్రియ ముగిసేలోపు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!