
జనరల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సింగారం వెస్ట్ బీట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ బీట్ ఆఫీసర్ నవీన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చును గుర్తించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
రాత్రి 9 గంటల సమయంలో సిబ్బందితో కలిసి విధుల్లో ఉన్న నవీన్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!