

చైనా మరోసారి తన ఇంజనీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చూపించింది. కేవలం 38 నెలల్లోనే చాంగ్కింగ్ ఈస్ట్ హైస్పీడ్ రైల్వే హబ్‌ను నిర్మించి చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టు 2022 మేలో చాంగ్కింగ్ నాన్ఆన్ జిల్లాలో ప్రారంభమై, 2025 జూన్‌లో ప్రారంభోత్సవం జరిగింది.
ఈ స్టేషన్ 12.2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే హబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇందులో హైస్పీడ్ రైళ్లు, మెట్రో, బస్సులు, ట్యాక్సీలు వంటి రవాణా వ్యవస్థలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. 15 ప్లాట్‌ఫాంలు, 29 ట్రాక్‌లతో ఈ స్టేషన్ గంటకు 16,000 మందికి సేవలందించగలదు. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ ఏఐ, రోబోటిక్స్, లైడార్, 5జీ టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా ఖర్చులు 40 శాతం తగ్గగా, ప్రమాదాల రిస్క్ కూడా గణనీయంగా తగ్గింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ షేర్ చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!