

భారత వాయుసేన నాగ్‌పుర్‌లోని వాయుసేన నగర్లో ‘ఎయిర్ ఫెస్ట్ 2026’ను నిర్వహిస్తోంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ వేడుకలో భాగంగా ప్రదర్శించిన వైమానిక విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం, సారంగ్ హెలికాప్టర్ ప్రదర్శన బృందం ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలతో అలరించాయి. సమన్వయంతో కూడిన వాటి ప్రదర్శనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
మరోవైపు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం చేసిన సాహసోపేత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశ్ గంగా స్కైడైవింగ్ బృందం ప్రదర్శించిన విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై వాయుసేన ప్రదర్శనలను తిలకించారు. భారత వాయుసేన సామర్థ్యం, పైలట్ల నైపుణ్యం, సాహసోపేత ప్రదర్శనలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఈ వేడుక ద్వారా ప్రేక్షకులకు లభించింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!