

మహిళా ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి సెల్‌ఫోన్ ఇంకా పోలీసులకు లభించలేదు. అరెస్టు అనంతరం హైదరాబాద్ మోతీనగర్‌లోని ఆయన బంధువు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినప్పటికీ మొబైల్ ఫోన్ దొరకలేదు. కీలక ఆధారాలు ఉండే అవకాశం ఉన్న ఫోన్‌ను ఎక్కడైనా దాచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో ఉదయ్‌కృష్ణారెడ్డి తనకు సంబంధించిన వీడియోలు సెల్‌ఫోన్‌లో ఉన్నాయని, అదే ఫోన్ ద్వారా తన భర్తకు అభ్యంతరకర సందేశాలు పంపినట్లు పేర్కొన్నారు. నిందితుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌లో కూడా తన వద్ద వీడియోలు ఉన్నాయని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకోవడం కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. నిందితుడి ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన పోలీసులు, వాట్సప్ గ్రూపుల్లో మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై తప్పుడు ప్రచారం జరిగిన అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!