14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

Writer: Shivani K 05:16 PM, 14 సెప్టెంబర్, 2026
మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని భారత్‌ పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ.. ఇస్లామాబాద్‌ మాత్రం ఆ వాదనను అంగీకరించడం లేదు. తాజాగా, మసూద్‌ పాకిస్థాన్‌లో లేడనే వాదనకు బలం చేకూర్చేలా ఆ దేశ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) అతడి పేరును ‘మోస్ట్‌ వాంటెడ్‌’ ఉగ్రవాదుల రెడ్‌ బుక్‌లో చేర్చింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయల బహుమతిని ప్రకటించింది. ఐదేళ్ల క్రితం ఇదే విషయంపై 50 లక్షల పాకిస్థానీ రూపాయల రివార్డును ప్రకటించిన పాక్‌.. ఇప్పుడు మరో 20 లక్షలు పెంచింది. అక్టోబర్‌లో జరగనున్న ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ సమాజానికి చూపించి, ఒత్తిళ్లను తగ్గించుకునేందుకే పాక్‌ ఈ ప్రకటన చేసి ఉండొచ్చని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మసూద్‌ అఫ్గానిస్థాన్‌లో తలదాచుకున్నాడని పాక్‌ 2021 నుంచి చెబుతున్నప్పటికీ.. ఆ వాదనను అఫ్గాన్‌ తిరస్కరించింది. మరోవైపు, మసూద్‌ పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లోని నవాబ్‌షాలో ఉన్నట్లు భారత నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్‌ఐఏ రెడ్‌ బుక్‌లో 26/11 ముంబయి ఉగ్రదాడులతో సంబంధమున్న 19 మంది పేర్లు కూడా ఉన్నాయి. అయితే, వీరిలో పలువురు పాక్‌లోనే ఉన్నారని, అంతర్జాతీయ ఒత్తిడిని తప్పించుకునేందుకు వారిని ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితాలో చేర్చారని భారత్‌ ఆరోపిస్తోంది. మసూద్‌ అజార్‌ భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 1995లో భారత్‌ అతడిని అరెస్టు చేయగా.. 1999లో ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్‌ చేసి అతడిని విడిపించుకున్నారు. అనంతరం అతడు జైషే మహ్మద్‌ను స్థాపించాడు. 2001 పార్లమెంట్‌ దాడి, 2008 ముంబయి దాడుల్లోనూ అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019లో ఐక్యరాజ్యసమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు
ట్యాగ్లు
మసూద్ అజార్పాకిస్థాన్జైషే మహ్మద్భారత్-పాకిస్థాన్ఉగ్రవాదంఎఫ్‌ఐఏమోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిఎఫ్‌ఏటీఎఫ్ముంబయి ఉగ్రదాడులుఅంతర్జాతీయ ఉగ్రవాదం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
జనరల్

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్
జనరల్

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!
సినిమాలు

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!
గాసిప్స్

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
క్రీడలు

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి
జనరల్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌
జనరల్

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు
జనరల్

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల