
క్రీడలు

దక్షిణాఫ్రికాలోని వెస్టర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. N1 హైవేపై ప్రిన్స్ ఆల్బర్ట్, లీయూ-గామ్కా పట్టణాల మధ్య రెండు మినీబస్ ట్యాక్సీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కేప్‌టౌన్‌కు సుమారు 380 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది.
రెండు మినీబస్సులు ఢీకొన్న కొద్దిసేపటికే వాటిపైకి ఓ SUV దూసుకెళ్లడంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో N1 హైవేను అధికారులు మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!