
జనరల్

ఆసియా కప్ టైటిల్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత మహిళల జట్టుకు ఊహించని షాక్ తగిలింది. యువ పేసర్ క్రాంతి గౌడ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి చర్యలు తీసుకుంది. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది.
లెవల్-1 నిబంధనల ఉల్లంఘనలకు అధికారిక మందలింపుతో పాటు ఆటగాడి మ్యాచ్ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు కూడా కేటాయించవచ్చు. క్రాంతి గౌడ్‌కు లభించిన డీమెరిట్ పాయింట్ గత 24 నెలల్లో ఆమెకు ఇదే మొదటిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!