

కాకినాడ జగన్నాథపురం జమ్మిశెట్టి సెంటర్‌లో వినాయక చవితి వేడుకలు వినూత్నతకు వేదికగా మారాయి. ప్రతి ఏటా ప్రత్యేకమైన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకునే నిర్వాహకులు.. గతేడాది జేమ్స్ చాక్లెట్లతో విగ్రహాన్ని రూపొందించగా, ఈసారి మరింత ప్రత్యేకంగా జీడిపప్పుతో గణనాథుడిని తీర్చిదిద్దారు. దీంతో ఈ విగ్రహం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఏకంగా 18 అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ కాజు గణనాథుడి కోసం సుమారు 500 కిలోల నాణ్యమైన జీడిపప్పును వినియోగించారు. చీరాల ప్రాంతం నుంచి ప్రత్యేకంగా రప్పించిన నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు రాత్రింబవళ్లు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు. జీడిపప్పుతో ప్రతి భాగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జగన్నాథపురంలోని ఈ ప్రత్యేక గణనాథుడిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!