15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

Writer: Pooja 06:06 AM, 15 సెప్టెంబర్, 2026
పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సభ్యులకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా మరో అడుగు వేసింది. ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, తాజా అప్‌డేట్లను సభ్యులకు నేరుగా అందించేందుకు అధికారిక వాట్సాప్‌ చానల్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. వ్యక్తిగత పీఎఫ్‌ ఖాతా వివరాలైన బ్యాలెన్స్‌, క్లెయిమ్‌ స్థితి వంటి సమాచారాన్ని అందించేందుకు వాట్సాప్‌ ఆధారిత కృత్రిమ మేధ చాట్‌బాట్‌ సేవలను కూడా తీసుకొచ్చే ప్రణాళిక ఉంది.

ప్రతిపాదిత వ్యవస్థలో సభ్యులు ఈపీఎఫ్‌ఓ ధ్రువీకరించిన వాట్సాప్‌ నంబర్‌కు ‘హలో’ అని సందేశం పంపడం ద్వారా సేవలను ప్రారంభించవచ్చు. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను ధ్రువీకరించిన తర్వాత వివిధ సేవల మెనూ అందుబాటులోకి వచ్చేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. పీఎఫ్‌ బ్యాలెన్స్‌, గత ఐదు లావాదేవీలు, క్లెయిమ్‌ స్థితి, కేవైసీ వివరాలు, వడ్డీ జమ వివరాలు, యూఏఎన్‌ సంబంధిత ప్రశ్నలు, సాధారణ ఫిర్యాదులు, పెండింగ్‌ చర్యల వివరాలను అందించేలా చాట్‌బాట్‌ను రూపొందించే ప్రణాళిక ఉంది. ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నారు.

అయితే అధికారిక వాట్సాప్‌ చానల్‌ అందుబాటులోకి వచ్చిందని వ్యక్తిగత పీఎఫ్‌ ఖాతా సేవలన్నీ ఇప్పటికే వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయని భావించకూడదు. ఈపీఎఫ్‌ఓ గతంలోనే ప్రాంతీయ కార్యాలయాల ద్వారా వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ సేవలను నిర్వహిస్తోంది. వ్యక్తిగత ఖాతా సేవల కోసం ప్రతిపాదిత కృత్రిమ మేధ చాట్‌బాట్‌ వేరు. ఈపీఎఫ్‌ఓ పేరుతో వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్‌ పట్ల సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. యూఏఎన్‌ పాస్‌వర్డ్‌, ఆధార్‌, పాన్‌, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఈపీఎఫ్‌ఓ హెచ్చరిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌

జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!

ట్యాగ్లు
ఈపీఎఫ్‌ఓపీఎఫ్‌ ఖాతావాట్సాప్‌ చానల్కృత్రిమ మేధ చాట్‌బాట్పీఎఫ్‌ బ్యాలెన్స్సైబర్ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?
సినిమాలు

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌
క్రీడలు

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్
జనరల్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి
జనరల్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
బిజినెస్

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!