

మనుషులకు ఆరోగ్య సమస్య లేదా ప్రమాదం ఎదురైతే ఒక ఫోన్ కాల్‌తో ఉచిత ప్రభుత్వ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన, అనారోగ్యంతో బాధపడుతున్న వీధి జంతువులకు ఇలాంటి సాయం తరచూ అందడం లేదు. ఈ లోటును భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఆరుద్ర ఫర్ యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను మే 2026లో ప్రారంభించారు. “మాట్లాడలేని జంతువులకు మనమే గొంతుక కావాలి” అనే నినాదంతో పనిచేస్తున్న ఈ సంస్థ జంతు సంక్షేమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది.
నిజాంపేట్ కేంద్రంగా పనిచేస్తున్న ఆరుద్ర ఫౌండేషన్ నగరంలోని పలు ప్రాంతాల్లో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతోంది. ప్రమాదానికి గురైన లేదా అనారోగ్యంతో ఉన్న వీధి జంతువు కనిపిస్తే 91549 82901 నంబర్‌కు కాల్ చేయడంతో పాటు వాట్సాప్‌లో ప్రాంత వివరాలను పంపవచ్చు. సుమారు అరగంటలో అంబులెన్స్‌తో వైద్య సిబ్బంది చేరుకుంటారని సంస్థ చెబుతోంది. జంతువులను రక్షించడంతో పాటు వాటి సంరక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జంతువులపై హింసను అరికట్టడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించడం, స్వచ్ఛందంగా సేవ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సంస్థ కోరుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!