

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ-ఇన్) ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ 14, 15, 16, 16 క్యూపీఆర్2, ఆండ్రాయిడ్ 17తో పనిచేసే డివైజ్‌లు ఉన్నవారు వీలైనంత త్వరగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
ఆండ్రాయిడ్ రన్‌టైమ్, డాక్యుమెంట్స్‌యూఐ, మీడియాటెక్ ఫ్రేమ్‌వర్క్, మీడియా కోడెక్స్, మీడియా ప్రొవైడర్, టెలిఫొనీ, యూడబ్ల్యూబీ, వైఫై వంటి పలు ఆండ్రాయిడ్ భాగాల్లో భద్రతా లోపాలు గుర్తించినట్లు సీఈఆర్‌టీ-ఇన్ తెలిపింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు డివైజ్‌లలోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు గూగుల్ ఇప్పటికే భద్రతా ప్యాచ్‌లను విడుదల చేసింది. దీంతో యూజర్లు సెట్టింగ్స్‌లోని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా సిస్టమ్ అప్‌డేట్ ఆప్షన్ ద్వారా తమ డివైజ్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్‌టీ-ఇన్ సూచించింది. తాజా ఆండ్రాయిడ్ వర్షన్‌ను వినియోగించడంతో పాటు గుర్తుతెలియని వనరుల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకుండా ఉంటే సైబర్ ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!