

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మహిళల్లో ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉత్తర కరోలినాలో ప్రత్యేక ‘దేశీ డాన్స్ వర్కౌట్’ జుంబా కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడి ఓ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ప్రముఖ జుంబా ఇన్‌స్ట్రక్టర్ మౌనిక కావలి మహిళలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. సౌమ్యశ్రీ తలంకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి ఏలూరి ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. పాల్గొన్న మహిళలందరికీ అమోఘం ఇండియన్ రెస్టారెంట్ సౌజన్యంతో ఉచిత అల్పాహారం అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ రావు అభినందించారు. తానా ప్రతినిధి రవి (నాని) వడ్లమూడి, ప్రత్యేక ప్రాజెక్టుల కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి, టీమ్ స్క్వేర్ చైర్‌పర్సన్ కిరణ్ కొత్తపల్లి, ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేనితో పాటు పలువురు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!