

1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వాయుసేనకు చెందిన ఆపరేషన్ సఫేద్ సాగర్‌లో పాల్గొన్న రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తాపై గురుగ్రామ్‌లోని మాగ్నమ్ గ్లోబల్ పార్క్‌లో పార్కింగ్ సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సెప్టెంబర్ 10న కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన సమయంలో పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం. పార్కింగ్ సిబ్బంది తనను పలు ప్రాంతాలకు తిప్పి చివరకు వాహనం పార్క్ చేయడానికి నిరాకరించారని గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను కారు వెనక్కి తీస్తున్న సమయంలో ఓ పార్కింగ్ సిబ్బంది వాహనాన్ని కొట్టాడని, దీనిపై ప్రశ్నించేందుకు కారు నుంచి దిగిన తర్వాత ఇనుప రాడ్‌తో తనపై దాడి చేశాడని గుప్తా ఆరోపించారు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయం కాగా, మోచేయి/ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయింది. కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం తనను చంపేస్తానని బెదిరించినట్లు కూడా గుప్తా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!