

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెట్రో మొదటి, రెండో దశల్లో కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా భాగస్వామ్యం కావాలా అనే అంశంపై ఎస్‌బీఐ క్యాప్స్ సిద్ధం చేస్తున్న నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే డీఎంఆర్సీ, ఐడీబీఐ సమర్పించిన నివేదికలను కేంద్రానికి పంపగా, ఇప్పుడు స్వతంత్ర అంచనాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించింది.
మెట్రో మొదటి దశ స్వాధీనానికి రూ.13,600 కోట్ల రుణం అవసరమని అధికారులు తెలిపారు. రెండో దశ విస్తరణకు సంబంధించిన వ్యయ అంచనాలు కూడా ఎస్‌బీఐ క్యాప్స్ నివేదిక ఆధారంగానే ఖరారు కానున్నాయి. ఈ నివేదికను ఆరు నెలల్లో సమర్పించనుండగా, దాని తర్వాత స్వాధీనం, విస్తరణ, నిధుల సమీకరణపై తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధాన మెట్రో విస్తరణ పనులు 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!