
షోస్

సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో స్థానిక బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో హిందూ మతంపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని, అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనసూయపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
అయితే ఈ వివాదంపై అనసూయ ఇప్పటికే స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకవైపు బీజేపీ నేతల ఫిర్యాదు, మరోవైపు అనసూయ వివరణతో ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!