

బీజేపీలో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు కొత్త టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పదాధికారులతో పాటు కీలక కమిటీల్లోనూ మార్పులు, కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉంది. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాబోయే లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా కొత్త కార్యవర్గాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్ నబీన్, బీఎల్ సంతోష్ నెల రోజులుగా కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త కార్యవర్గం ప్రకటన అనంతరం కేంద్ర మంత్రివర్గంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే కొత్త టీమ్‌లో ఎవరికి చోటు దక్కుతుంది, కీలక పదవుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి, కేంద్ర మంత్రుల్లో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే అంశాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!