

ది హండ్రెడ్ మెన్స్ 2026 టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 16న లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ట్రెంట్ రాకెట్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 158/8 స్కోరు చేయగా.. మాంచెస్టర్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు, సోనీ బేకర్ 2 వికెట్లు తీశారు.
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు టిమ్ సీఫర్ట్ విధ్వంసకర ఆరంభం అందించాడు. 38 బంతుల్లో 72 పరుగులు చేసిన సీఫర్ట్ ఏడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడు ఔటైన తర్వాత జట్టు కాస్త తడబడినా.. చివర్లో లియామ్ డాసన్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. మాంచెస్టర్ 19.3లో 162/5కు చేరుకుని రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. గతంలో రెండు ఫైనల్స్‌లో ఓడిన ఆ జట్టుకు ఇది తొలి హండ్రెడ్ టైటిల్.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!