
షోస్

నటి కామాక్షి భాస్కర్ల తన సినీ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. కమెడియన్ సత్యం రాజేష్‌తో గతంలో కలిసి నటించిన కారణంగా కూడా ఓ సినిమా అవకాశం తనకు దూరమైందని ఆమె తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘మెగా 158’ చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని చెప్పారు.
బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రంతో పాటు త్రివిక్రమ్–వెంకటేష్ కాంబినేషన్‌లోనూ నటించే అవకాశం మిస్ అయిందని కామాక్షి పేర్కొన్నారు. అయితే ఈ అనుభవాలను తాను నిరాశకు కారణంగా భావించడం లేదని, భవిష్యత్తులో తప్పకుండా తనకు నచ్చిన అగ్ర నటులు, దర్శకులతో కలిసి పనిచేస్తాననే సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నానని ఆమె తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!