

బాలీవుడ్ నటి సయామీ ఖేర్ త్వరలో ‘హైవాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సైకలాజికల్ డ్రామాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సయామీ ఖేర్ బాలీవుడ్‌లో నటీమణుల రూపం, దుస్తులు, వ్యక్తిత్వంపై ఉండే ఒత్తిడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కెరీర్ ప్రారంభంలో తాను ఎలా కనిపించాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అనే విషయాల్లో పలువురు నిర్మాతలు సలహాలు, సూచనలు ఇచ్చేవారని ఆమె తెలిపారు. చివరకు తన సహజమైన ఉంగరాల జుట్టును మార్చుకోవాలని కూడా చెప్పారని వెల్లడించారు. అయితే ఇతరుల మాట విని తన ఒరిజినాలిటీని కోల్పోతే ఫ్యాక్టరీలో తయారైన బొమ్మలా మారిపోతానని భావించి, తన ప్రత్యేకతను కాపాడుకున్నానని సయామీ చెప్పారు. తల్లిదండ్రులు నేర్పిన విలువలకు కట్టుబడి ఉండటం, తనకు నచ్చిన విధంగా జీవించడం వల్లే ‘హైవాన్’ వంటి మంచి ప్రాజెక్టులు దక్కుతున్నాయని ఆమె పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!