
జనరల్

గోదావరి పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.100 కోట్లు విడుదల చేసిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పుష్కర ఘాట్లు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, దేవాలయాల పునరుద్ధరణ పనులకు ఈ నిధులు వినియోగిస్తామని చెప్పారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, కొత్త బైపాస్ రోడ్లు, రహదారి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, పనులు నాణ్యత లేకుండా జరిగాయని ఆరోపించారు. 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తిచేస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!