
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం సీసాల పరిమాణాలకు అదనంగా కొత్త సైజులను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు పాత నిబంధనలను సవరించి తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం 90 మిల్లీలీటర్లు, 180 మిల్లీలీటర్లు, 375 మిల్లీలీటర్లు, 750 మిల్లీలీటర్ల పరిమాణాల్లో మద్యం సీసాలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 150 మిల్లీలీటర్లు, 200 మిల్లీలీటర్ల కొత్త సైజులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!