
జనరల్

భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి–తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. నెం.07001 చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి ఈ నెల 4వ తేదీ నుంచి సెప్టెంబరు 24 వరకు సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటుంది.
మరోవైపు నెం.07002 తిరువణ్ణామలై నుంచి చర్లపల్లికి ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబరు 26 వరకు రాత్రి 11.10 గంటలకు బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం 4.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కాట్పాడి, వేలూరు వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!