
జనరల్

సచివాలయం వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్ధిపేట జిల్లాకు చెందిన దంపతులు భూ వివాదానికి పరిష్కారం లభించలేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొండపోచమ్మపల్లి గ్రామానికి చెందిన పుట్ట కృష్ణయ్య, ఆయన భార్య సాయమ్మ తమ వ్యవసాయ భూమి సమస్యపై అధికారులను పలుమార్లు సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వారిని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ప్రమాదాన్ని అడ్డుకున్నారు. అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!