
రాజకీయాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు శుభవార్త తెలిపింది. కరువు భత్యాన్ని 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 58 శాతంగా ఉన్న డీఏను 60 శాతానికి పెంచింది. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో ఉద్యోగులకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించనుంది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సవరించిన డీఏ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు లాభపడనున్నారు. ఉద్యోగుల వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, తమ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!