
సినిమాలు

గుడివాడలో తనపై నమోదైన కేసులో మాజీ మంత్రి కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఊరట కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాసిక్యూషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో పాటు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొడాలి నానిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న 2021 ఫిబ్రవరిలో, చంద్రబాబు నాయుడు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2021 ఫిబ్రవరి 16న కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!