
క్రీడలు

దసరా, దీపావళి పండుగల వేళ సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త అందించింది. ఒక్కో కార్మికుడికి రూ.1,10,250 దీపావళి బోనస్ చెల్లించేందుకు అంగీకరించింది. కోల్‌కతాలో కోల్‌ఇండియా యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కార్మికుల శ్రమకు గుర్తింపుగా ప్రకటించిన ఈ బోనస్‌తో వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
దేశవ్యాప్తంగా కోల్‌ఇండియాలో పనిచేస్తున్న 1,96,753 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ఈ బోనస్ అందనుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 30 మధ్య పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులకు రూ.8,351 చొప్పున చెల్లించనున్నారు. గతేడాది రూ.1,05,000గా ఉన్న బోనస్‌ను ఈసారి రూ.1,10,250కు పెంచారు. ఈ సమావేశంలో సింగరేణి యాజమాన్య ప్రతినిధులు, జనరల్ మేనేజర్లు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!