

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుఫాను కొనసాగుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతున్నట్లు ఆర్టీజీఎస్, ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించాయి. ప్రస్తుతం ఇది నరసాపురం, కళింగపట్నం తీరాలకు సుమారు 440 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 580 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 530 కిలోమీటర్లు, పూరీకి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు మధ్యాహ్నానికి నరసాపురం–పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను కదలికలను, దాని ప్రభావాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తుఫాను ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!