
జనరల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సేవలను కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర సిబ్బంది శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఆయన సేవల పొడిగింపుకు అనుమతి ఇచ్చింది.
ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం రూల్ 16(1) కింద ఈ పొడిగింపు మంజూరైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలన అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన కొనసాగింపు సేవలు రాష్ట్ర ప్రభుత్వ పనుల్లో కీలకంగా ఉండనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!