
క్రీడలు

తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీగా ముడుపులు ఆఫర్ చేసిన కేసులో గురువారం పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ కేసులో మాజీ డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు ఆయన సోదరుడు అశోక్ కుమార్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
కృష్ణగిరి జిల్లా ఊత్తాంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. శాసనసభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తిరునావుక్కరసు అనే వ్యక్తి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి వరుస అరెస్టులు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!