
జనరల్

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ నోవాటెల్‌లో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమని అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జీవిత ప్రయాణం విద్యకు గొప్ప ఉదాహరణ అని లోకేష్ చెప్పారు. ఆమె గిరిజన గ్రామం నుంచి దేశ రాష్ట్రపతిగా ఎదగడం విద్య శక్తిని చూపిస్తుందని అన్నారు. విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!