
క్రీడలు

2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి అర్హులైన క్రిస్టియన్ల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ (మైనార్టీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ పి. సబిత తెలిపారు. ఈ పథకం కింద చిన్న వ్యాపార యూనిట్లకు ఆర్థిక సాయం, కుట్టుమెషీన్లు, ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ వంటి సదుపాయాలు అందించనున్నారు.
పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలలోపు ఉన్నవారు అర్హులని అధికారులు తెలిపారు. జూలై 3 నుంచి జూలై 18 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-23391067ను సంప్రదించవచ్చని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!