

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం మూడో విడత నిధులను విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330.32 కోట్లు నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు, 22.17 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించిన లబ్ధి పొందారు. ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
అదే సమయంలో రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) ప్రత్యామ్నాయ పర్సన్ ఇన్ చార్జ్ (పీఐసీ) కమిటీలను ప్రభుత్వం నియమించింది. రుణాల వసూళ్లలో జాప్యం, పరిపాలనా లోపాలు, ఆడిట్ అభ్యంతరాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కమిటీలు సేవలు అందిస్తాయని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!