
ఆరోగ్యం

అంతర్జాతీయ స్థాయిలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను గువాహటి పోలీసులు ఛేదించారు. సుమారు 37 కేజీల బంగారంతో పాటు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. దాదాపు రూ.54 కోట్ల విలువైన ఈ బంగారం పట్టుబడటం ప్రాంత చరిత్రలోనే పెద్ద ఘటనగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెట్‌వర్క్‌కు మధ్య ఆసియా, మయన్మార్ దేశాలతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
జూన్ 29, 30 తేదీల్లో ఖార్గుల్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర సాంగ్లీకి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 13 గ్రాముల వెండి, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.3,755 నగదు, రవాణాకు ఉపయోగించిన సంచులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!