
సినిమాలు

విశాఖపట్నంలోని నోవాటెల్లో నిర్వహించిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ బహూకరించారు.
గిరిజన వర్సిటీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కేంద్రంగా నిలుస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేశ్, అనిత తదితరులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!