

భారత్ తూర్పు తీరం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఏఐ కనెక్టివిటీని మరింత వేగవంతం చేసేందుకు లైట్‌స్టార్మ్ సంస్థ కీలక ప్రాజెక్టును ప్రకటించింది. 3,600 కిలోమీటర్ల పొడవైన 'ఐ-2సీ' సబ్‌సీ కేబుల్ ద్వారా సింగపూర్, మలేషియా, మచిలీపట్నం, చెన్నై నగరాలను అనుసంధానించనుంది. ఈ ప్రాజెక్టు కోసం మైక్రోసాఫ్ట్, సింగ్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
లైట్‌స్టార్మ్ గ్రూప్ సీఈఓ, ఎండీ అమజిత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు 2029 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా హైదరాబాద్, చెన్నై, సింగపూర్, మలేషియా నగరాల్లోని ఏఐ, హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల మధ్య డేటా ప్రసారం మరింత వేగంగా, తక్కువ ఆలస్యంతో జరుగనుంది.
ఈ సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టుతో భారత్-ఆగ్నేయాసియా మధ్య డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని సంస్థ తెలిపింది. భవిష్యత్‌లో ఏఐ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, హైస్పీడ్ డేటా ట్రాన్స్‌మిషన్ అవసరాలను ఈ ప్రాజెక్టు సమర్థవంతంగా తీర్చనుందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!