
క్రీడలు

మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సీఎంకు వినతిపత్రాలు సమర్పించింది.
ఏజెన్సీ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయడం, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్‌తో పాటు పలువురు గిరిజన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!