
జనరల్

హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ సమన్వయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భూసేకరణ, కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
హైదరాబాద్–ముంబై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై కారిడార్లకు సంబంధించిన డిపిఆర్ ఇప్పటికే సిద్ధమైందని అధికారులు తెలిపారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో భూసేకరణ అవసరమని వివరించారు. కోకాపేట, శంషాబాద్ ప్రాంతాల్లో డిపోలకు భూమి అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణను ప్రధాన ఆర్థిక అభివృద్ధి కారిడార్‌గా మార్చే అవకాశం ఉందని సిఎస్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!