

మీ ఇంట్లో కారు లేదా బైక్ ఉందా? అయితే వాహన బీమాకు సంబంధించి కీలకమైన మార్పులను తెలుసుకోవాలి. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) డిసెంబర్ 15, 2026 నుంచి ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాల బీమా పాలసీలకు నాలుగు విభాగాల విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో థర్డ్ పార్టీ లయబిలిటీ, ప్రయాణికులపై చట్టపరమైన బాధ్యత కవరేజ్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ ఉంటాయి. థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి కాగా, వాహన యజమాని పేరుతో ఉండే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా నిబంధనల ప్రకారం తప్పనిసరి. ప్రయాణికుల కవరేజ్, అదనపు పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్‌ను అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
ఈ కొత్త విధానంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. ప్రయాణికులపై చట్టపరమైన బాధ్యత కవరేజ్ పరిధిలో వాహన యజమాని, వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు ఉండరు. కాబట్టి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా రక్షణ కావాలంటే ప్రత్యేకంగా తగిన పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఉందో లేదో పరిశీలించాలి. ఇప్పటికే థర్డ్ పార్టీ పాలసీ ఉన్నవారు దాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. అదనపు ప్రీమియం చెల్లించి, అదే బీమా సంస్థ ద్వారా ప్రయాణికుల కవరేజ్‌ను జోడించుకోవచ్చు. ఇకపై బీమా సంస్థలు ప్రతి కవరేజ్‌కు సంబంధించిన ప్రీమియాన్ని విడివిడిగా వెల్లడించడంతో పాటు, కస్టమర్ ఆప్షన్ ఫారం, కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ అందించాలి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!