

చెన్నైకి చెందిన పెట్టుబడి సలహాదారు ముత్తుకృష్ణన్ ధండపాణి భారతీయ కుటుంబాలు ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో ఉండాలని సూచించారు. కనీసం మూడు సంవత్సరాల కుటుంబ ఖర్చులను భరించగలిగే స్థాయిలో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా రుణాలు తీసుకోవడం తగ్గించాలని, ఇల్లు కొనుగోలు చేయడం లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక నిర్ణయాలను మరోసారి పరిశీలించాలని పేర్కొన్నారు. ఉద్యోగంలో హోదా కంటే ఆదాయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అయితే సమీప భవిష్యత్తులో ఆర్థిక పతనం తప్పదని తాను చెప్పడం లేదని ధండపాణి స్పష్టం చేశారు. ప్రపంచం గతంలోనూ అనేక ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొందని, భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితులు రావచ్చని పేర్కొన్నారు. కష్టకాలంలో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందస్తు ప్రణాళిక, పొదుపు ఉపయోగపడతాయని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది. కొందరు ఈ సూచనలను సమర్థిస్తుండగా, మధ్యతరగతి కుటుంబాలు మూడు సంవత్సరాల ఖర్చులకు సరిపడా పొదుపు చేయడం వాస్తవికమేనా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!