
జనరల్

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం ఖాన్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ వీధుల జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ విడుదల చేసిన 2026 నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల జాబితాలో ఖాన్ మార్కెట్ 24వ స్థానంలో నిలిచింది. ఇక్కడ వార్షిక రిటైల్ అద్దెలు గత ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి చదరపు అడుగుకు 238 డాలర్లకు చేరుకున్నాయి.
ప్రపంచ జాబితాలో స్థానం దక్కించుకున్న భారతీయ రిటైల్ ప్రాంతాల్లో ఖాన్ మార్కెట్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు, వినియోగదారులు, వ్యాపార సంస్థల నుంచి ఈ ప్రాంతానికి పెరుగుతున్న ఆదరణ ప్రీమియం వాణిజ్య స్థలాలకు ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. అద్దెల పెరుగుదలతో పాటు ఖాన్ మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్య రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!