
సినిమాలు

బజాజ్ ఆటో తన ఫ్లాగ్‌షిప్ నేకెడ్ బైక్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్ అప్‌డేటెడ్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.90 లక్షలుగా నిర్ణయించింది. కొత్త మోడల్‌లో ప్రధానంగా ఫీచర్లను అప్‌డేట్ చేశారు. ఇందులో సరికొత్త 5 అంగుళాల థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ (టీఎఫ్‌టీ) డిస్‌ప్లేను అందించారు.
కొత్త డిస్‌ప్లే ద్వారా గూగుల్ మ్యాప్స్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి సదుపాయాలను పొందవచ్చు. అలాగే పానిక్ బ్రేక్ అలర్ట్, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు. ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పాత 349 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ 40 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లు యథావిధిగా కొనసాగాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!