
.webp&w=3840&q=75)
యాపిల్ సంస్థ భారత్‌లో తన రిటైల్ విస్తరణను కొనసాగిస్తూ ముంబైలో రెండో స్టోర్‌ను ఈ నెల 26 న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బోరివలి ప్రాంతంలోని స్కై సిటీ మాల్లో ఏర్పాటైన ఈ కొత్త స్టోర్‌లో ఉత్పత్తుల విక్రయం, ఇన్ స్టోర్ పికప్, జీనియస్ బార్ సపోర్ట్ సేవలు, అలాగే “టుడే అట్ యాపిల్” శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి కస్టమర్లకు సేవలు ప్రారంభమవుతాయి.
భారత్‌లో యాపిల్ తొలి అధికారిక రిటైల్ స్టోర్ 2023 లో ముంబైలో ప్రారంభమైంది. అనంతరం నోయిడా సహా పలు నగరాల్లో కొత్త స్టోర్లను ప్రారంభిస్తూ సంస్థ తన ప్రత్యక్ష రిటైల్ వ్యూహాన్ని బలోపేతం చేసింది. తాజా ప్రారంభంతో దేశవ్యాప్తంగా యాపిల్ ఫిజికల్ స్టోర్ల సంఖ్య ఆరుకు చేరుకోనుంది. వినియోగదారులతో ప్రత్యక్ష అనుభవాన్ని పెంచడమే ఈ విస్తరణ లక్ష్యంగా ఉంది.
భవిష్యత్‌లో మరిన్ని స్టోర్లను ప్రారంభించాలనే యోచనలో సంస్థ ఉన్నట్లు యాపిల్ సీఈఓ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్‌లో కొత్త రిటైల్ స్టోర్ ప్రారంభానికి నియామక ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. అలాగే చెన్నైలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో తయారీకి మాత్రమే కాకుండా గ్లోబల్ ఆపరేషన్స్‌లోనూ భారత్‌కు కీలక స్థానం ఇవ్వాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!