

చిన్నారులకు భద్రత, గౌరవం, స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పోక్సో కేసులపై నిర్లక్ష్యం, ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌కు ప్రత్యేకంగా లేఖలు రాశారు. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
పోక్సో కేసుల్లో విచారణ ఆలస్యం కారణంగా బాధితులకు సకాలంలో న్యాయం అందడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని, పోక్సో కేసులను సాధారణ కేసులుగా కాకుండా ప్రత్యేక కేసులుగా పరిగణించాలని కోరారు. ఇదిలా ఉండగా, కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ముంబైలోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ చేరుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!